Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 30, 2013

1వ సమూయేలు 24

1Sa 24:1  సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. 
1Sa 24:2  అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలాపర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను. 
1Sa 24:3  మార్గముననున్న గొఱ్ఱ దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక 
1Sa 24:4  దావీదు జనులు అదిగోనీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతు నని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను. 
1Sa 24:5  సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి 
1Sa 24:6  ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. 
1Sa 24:7  ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను. 
1Sa 24:8  అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి 
1Sa 24:9  సౌలుతో ఇట్లనెనుదావీదు నీకు కీడుచేయనుద్దే శించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు విను చున్నావు? 
1Sa 24:10  ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించిఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని. 
1Sa 24:11  నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రుును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. 
1Sa 24:12  నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను. 
1Sa 24:13  పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను. 
1Sa 24:14  ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కనుగదా? మిన్నల్లిని గదా? 
1Sa 24:15  యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. 
1Sa 24:16  దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలుదావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి 
1Sa 24:17  దావీదుతో ఇట్లనెనుయెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు 
1Sa 24:18  ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు. 
1Sa 24:19  ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. 
1Sa 24:20  నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచ బడుననియు నాకు తెలియును. 
1Sa 24:21  కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయ కుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను 
1Sa 24:22  అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లి పోయిరి. 

No comments:

Post a Comment