Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 30, 2013

1వ సమూయేలు 9

1Sa 9:1  అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీ నీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. 
1Sa 9:2  అతనికి సౌలు అను నొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యముగల యౌవనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరు డొకడునులేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తు గలవాడు. 
1Sa 9:3  సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచిమన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్దభములను వెదకుమని చెప్పెను. 
1Sa 9:4  అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషాదేశమున సంచరింపగా అవి కన బడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. 
1Sa 9:5  అయితే వారు సూపు దేశమునకు వచ్చి నప్పుడుమనము తిరిగి వెళ్లుదము రమ్ము, గార్దభముల కొరకు చింతింపక, నా తండ్రి మనకొరకు విచారపడు నేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా 
1Sa 9:6  వాడుఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను. 
1Sa 9:7  అందుకు సౌలుమనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరి పోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసి కొనిపోవుటకు మన కేమియు లేదు అని తన పనివానితో చెప్పిమనయొద్ద ఏమి యున్నదని అడుగగా 
1Sa 9:8  వాడు సౌలుతోచిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను. 
1Sa 9:9  ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినయెడలమనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవు దము రండని జనులు చెప్పుకొనుట వాడుక. 
1Sa 9:10  సౌలునీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా 
1Sa 9:11  వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లుచేదుకొను టకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడుఇక్కడ దీర్ఘ దర్శియున్నాడా అని అడిగిరి. 
1Sa 9:12  అందుకు వారుఇదిగో అతడు మీ యెదుటనే యున్నాడు, త్వరగా పోయి కలిసికొనుడి; యీ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నతస్థలమందు జనులకు బలి జరుగును గనుక 
1Sa 9:13  ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. 
1Sa 9:14  వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. 
1Sa 9:15  సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూ యేలునకు తెలియజేసెను. 
1Sa 9:16  ఎట్లనగానా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి యున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును. 
1Sa 9:17  సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవాఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. 
1Sa 9:18  సౌలు గవినియందు సమూయేలును కలిసికొనిదీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా 
1Sa 9:19  సమూయేలు సౌలుతోనేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, నేడు మీరు నాతో కూడ భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్న దంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను. 
1Sa 9:20  మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది? నీ యందును నీ తండ్రి యింటి వారియందును గదా అనెను. 
1Sa 9:21  అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటి వారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను. 
1Sa 9:22  అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి 
1Sa 9:23  పచనకర్తతోనేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా 
1Sa 9:24  పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెనుచూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచ బడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడభోజనముచేసెను, 
1Sa 9:25  పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీదనుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడు చుండెను. 
1Sa 9:26  మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలుమిద్దెమీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి 
1Sa 9:27  ఊరి చివరకు వచ్చు చుండగా సమూయేలు సౌలుతోమనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచి యుండుమనెను; అంతట వాడు వెళ్లెను. 

No comments:

Post a Comment